ఏసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు
హన్మకొండ: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో చార్జీలు త గ్గించినట్లు వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ బస్సుల్లో చార్జీలపై 10 శాతం రాయితీ అందిస్తున్నామని ఆమె ఒక ప్ర కటనలో పేర్కొన్నారు. ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌కు రూ.620 ఉండగా దీనిని రూ.570కి తగ్గించామని, ములుగు నుంచి హై దరాబాద్‌కు రూ.480 నుంచి రూ.440కి తగ్గించినట్లు వివరించారు. ఏటూరునాగారం, ము లుగు ప్రాంత ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
19 కిలోల ఎండు
గంజాయి స్వాధీనం
బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి గ్రా మం వద్ద పోలీసులు బుధవారం ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎస్‌కే హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా సంబల్పూర్ గ్రామానికి చెందిన నాబా కిషోర్ పాయక్ నుంచి 9 ప్యాకెట్లలో 19 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4.75 లక్షలు ఉంటుందని తెలిపారు. కిషోర్ పాయక్ ఒడిశా నుంచి ముంబాయికి గంజాయి సరఫరా చే స్తుండగా మార్గమధ్య జనగామ రైల్వే స్టేషన్‌లో పోలీసులను చూసి భయపడి రైలు దిగా డన్నారు. అనంతరం ఆటో ఎక్కి తమ్మడపల్లి లో దిగాడని పేర్కొన్నారు. సమాచారం మేరకు వెళ్లి అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశామని ఎస్సై వెల్లడించారు.
లారీ, బైక్ ఢీ..
● వ్యక్తి దుర్మరణం.. ఐనవోలులో ఘటన
ఐనవోలు: లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన ఎర్రం కనుకయ్య(54)బైక్‌పై బొల్లికుంట వద్ద జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో ఐనవోలు నుంచి వరంగల్ వైపునకు లారీ వెళ్తోంది. మండల కేంద్రంలోని శివారు మలుపు వద్దకు చేరుకునే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నారు. కనుకయ్య కింద పడగా లారీ అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ కొద్దిదూరం రాసుకుని వెళ్లగా .. ట్యాంక్‌లో పెట్రోల్ లీకై మెరుగులకు మంటలు చెలరేగి బైక్ పూర్తిగా కాలింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై శ్రీనివాస్.. కనుకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment