సమర్థవంతంగా పథకాలు అమలు చేయాలి
మహబూబాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, గ్రూప్–2 పరీక్షలు, వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పొ, వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment