ఎంజీఎం : ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు. తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య (60) సముద్రాల శ్రీదేవి(50) కూతురు చైతన్య(30) శివప్రసాద్(28)ను మెరుగై చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. మంగళవారం మధ్యాహ్నం విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వీరికి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో బుధవారం పరిస్థితి విషమించి నలుగురు మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బంధుమిత్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు.
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment