డోర్నకల్: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల్లో అభ్యసనశక్తి, చురుకుదనం పెరుగుతోందని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. సీరోలు మండలం మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీఈఓ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉపాధ్యాయులు సమకూర్చిన దుప్పట్లను పేద వృద్ధులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విత్తనాల సుధాకర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రుక్మాంగదరరావు, ఏఈఓలు అవినాశ్, కర్ణ, విజయపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని ధరణి, మెడ్‌విజన్, నిక్మాహెల్త్‌కేర్, తేజస్వీనర్సింగ్‌హోం, మైత్రి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ సారంగం బుధవారం తనిఖీ చేపట్టారు. ఆస్పత్రుల్లో అందించే వైద్య సేవలకు సంబంధించిన ధరల వివరాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. ఆస్పత్రి సిబ్బంది వివరాలు, అర్హత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది మారినట్లయితే వెంటనే వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ రాజు, ఎల్‌డీ కంప్యూటర్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment