విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలి
హన్మకొండ కల్చరల్ : విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీయాలని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ప్రొఫెసర్ భూక్య బాబురావు అన్నారు. బుధవారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు కోర్సు నూతన విద్యార్థుల స్వాగతమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ భూక్య బాబురావు మాట్లాడుతూ వరంగల్‌లో పీఠం ప్రారంభమైన 30సంవత్సరాల తరువాత పీజీ కోర్సు రావడం సంతోషకరమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ బాబురావును వి ద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞానపీ ఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీమంతుల దామోదర్, చూరేపల్లి రవికుమార్, బాసాని సురేశ్, అబ్బు గో పాల్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, పరా వస్తు విజయలక్ష్మి, సిద్ధోజు సునంద, ఆంజనేయులు, అశోక్, కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం
పీఠాధిపతి ప్రొఫెసర్ బాబురావు
Comments
Please login to add a commentAdd a comment