హాస్టల్ సౌకర్యం కల్పించాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం క్యాంపస్‌లోని పరిపాలనభవనం వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్‌పి. రాజ్‌కుమార్.. ఆందోళన చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ హాల్‌లో వీసీ ప్రతాప్‌రెడ్డి.. విద్యార్థి నాయకులు, ఆయా విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. దీంతో విద్యార్థినులు తమకు హాస్టల్ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీసీకి తెలిపారు. ఈసందర్బంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ మరోఆరునెలల్లో విద్యార్థినులకు హాస్టల్‌వసతి కోసం కృషిచేస్తామన్నారు. బీఎస్‌ఎఫ్ కేయూ ఇన్‌చార్జ్ కళ్లెపెల్లి ప్రశాంత్, అధ్యక్షుడు శివకుమార్, నాయకులు రాజేశ్, ధర్మేందర్, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కేయూలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment