నీతి ఆయోగ్ సమావేశంలో రవీందర్‌రెడ్డి
వరంగల్: ‘వ్యవసాయంలో ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం’(పీడీపీఎస్) అనే అంశంపై బుధవారం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రం నుంచి తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీడీపీఎస్ స్కీంపై మొదటిసారి జరిగిన ఈకమిటీ మీటింగ్ నీతి ఆయోగ్ చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్ చంద్ అధ్యక్షతన జరగగా.. నీతి ఆయోగ్ మెంబర్స్, వి విధ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కెమిస్ట్రీ బీఓఎస్‌గా సవితాజ్యోత్స్న
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా (బీఓఎస్)గా ఆ విభాగం ప్రొఫెసర్ సవితాజ్యోత్స్నను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి. మ ల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశా రు. ఇప్పటి వరకు ఆ బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ విభాగం ప్రొఫెసర్ ఎస్. జ్యోతి నుంచి బుధవారం సవితాజ్యోత్స్న బాధ్యతలు స్వీకరించారు.
జాతీయ సదస్సుకు సతీశ్
వరంగల్ చౌరస్తా : బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న తెలుగు, కన్నడ జానపద – గిరిజన సాహిత్యం తులనాత్మకత జాతీయ సదస్సుకు శ్రీవిశ్వేశ్వర సంస్కతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సోనబోయిన సతీశ్ ఎంపికయ్యారు. ‘తెలంగాణ బోనం–సంస్కృతి పరిశీలన’ అనే అంశంపై బెంగుళూరు విశ్వవిద్యాలయంలో పత్రాలు సమర్పించానని సతీశ్ తెలిపారు. ప్రిన్సిపల్‌కు కళా శాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment