స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలి
కేసముద్రం: వచ్చే స్థానిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు సత్తా చూపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, పార్టీ నియోజవకర్గ కార్యదర్శి బి.అజయ్‌సారథి అన్నారు. బుధవారం మండలంలోని అమీనాపురం గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ మతతత్వ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాలన సాగిస్తుందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దాటవేస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రజాసమస్యలను పాలకులు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, పెరుగు కుమార్, వెంకన్న, మంద భాస్కర్, ఉపేందర్, కొమురయ్య, సోమయ్య పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి
Comments
Please login to add a commentAdd a comment