సైబర్‌ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి

Published Thu, Dec 19 2024 8:21 AM | Last Updated on Thu, Dec 19 2024 8:21 AM

సైబర్

సైబర్‌ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి

మహబూబాబాద్‌ రూరల్‌/గూడూరు/దంతాలపల్లి/పెద్దవంగర/డోర్నకల్‌/నెల్లికుదురు: సైబర్‌ నేరాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని, అపరిచిత ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు స్పందించవద్దని ఎస్పీ సుధీర్‌ రాంనాధ్‌ కేకన్‌ బుధవారం తెలిపారు. ఇటీవల మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట, గూడూరు మండల కేంద్రాల్లో సైబర్‌ నేరగాళ్ల ఘరానా మోసాలు బయటపడ్డాయని, ఏఎస్సై అంటూ ఫోన్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు ఫోన్‌ పే చేయించుకున్న విషయం అందరికి తెలిసిందే అన్నారు. అందువల్ల పోలీసులని ఫోన్‌ చేసి డబ్బులు పంపమంటే ప్రజలు ఎవరు కూడా పంపి మోసపోవద్దని సూచించారు. సైబర్‌ నేరస్తుల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఎవరైనా ఆ విధంగా ఫోన్‌ చేసినట్లయితే వెంటనే 1930 ఫోన్‌ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

మరిపెడ/దంతాలపల్లి/మరిపెడ రూరల్‌: జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాలలో బుధవారం జరిగిన జీవశాస్త్ర ప్రతిభ పరీక్షలో మరిపెడ హైస్కూల్‌ విద్యార్థి సోనియా, దంతాలపల్లి జిల్లా ప్రజాపరిషత్‌ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థిని జ్యోత్స్న, మరిపెడ రూరల్‌ మండలంలోని వీరారం హైస్కూ ల్‌కు చెందిన విద్యార్థి శ్రీకాంత్‌ ద్వితీయ స్థానం పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

జాతీయస్థాయి క్రీడలకు..

మహబూబాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 తైక్వాండో పోటీల్లో మానుకోట లయన్‌ క్రీడాకారులు పాల్గొని బంగారు పథకాలు సాధించారని కోచ్‌ రాంబాబు బుధవారం తెలిపాడు. ఎంపికై న సంజయ్‌, ప్రసాద్‌, నిఖిల్‌ ముగ్గురు క్రీడాకారులు ఈనెల మధ్యప్రదేశ్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు.

స్విమ్మింగ్‌ పోటీలకు..

మహబూబాబాద్‌ రూరల్‌: జేఎన్‌టీయూ హైదరాబాద్‌ సౌత్‌ వెస్ట్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు మండంలోని అయోధ్య గ్రామానికి చెందిన మొగుళ్ల నేహా ఎంపికై ంది. అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం మాట్లాడుతూ. తమిళనాడులో ఈనెల 21నుంచి 23 వరకు జరగనున్న పోటీల్లో రాణించి విజయం సాధించాలన్నారు.

ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

గార్ల: గార్ల ఎస్సైగా ఎస్‌కె రియాజ్‌పాషా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎన్‌.జీనత్‌కుమార్‌ మహబూబాబాద్‌ ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లారు.

వ్యక్తిపై కేసు నమోదు

డోర్నకల్‌: 100 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసిన వ్యక్తిపై డోర్నకల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బి.రాజేష్‌ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లబండతండాకు చెందిన గుగులోత్‌ భాస్కర్‌ మద్యం తాగి 100 నంబర్‌కు పదేపదే ఫోన్‌ చేస్తూ బ్లూ కోల్ట్స్‌ సిబ్బందికి అడ్రస్‌ చెప్పకుండా విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. దీంతో భాస్కర్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

ఆర్థికసాయం

గార్ల: గార్ల సీహెచ్‌సీలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న ఎస్‌కె షకీరాబేగం కొంతకాలంగా కిడ్నీ సంబంధిత డయాలసిస్‌ సమస్యతో బాధపడుతుండగా, తోటి ఆరోగ్యమిత్రలు కలిసి బుధవారం రూ.48వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా టీం లీడర్‌ కందికట్ల సంతోష్‌, జిల్లా అధ్యక్షుడు రాసాల శ్రీనివాస్‌, కార్యదర్శి భీమిశెట్టి శ్రీనివాస్‌, యాకూబ్‌, రాము, విజయ్‌ పాల్గొన్నారు.

నల్లబెల్లం పట్టివేత

మహబూబాబాద్‌ రూరల్‌: నాలుగున్నర క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటిక పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశామని మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్సై విదీపికరెడ్డి బుధవారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులో గల రైల్వేగేట్‌ సమీపంలో నలుగురు వ్యక్తులు ఒక ద్విచక్రవాహనంతో నిలబడి ఉండగా వారి వద్ద నాలుగున్నర క్వింటాళ్ల నల్లబెల్లం, 10కిలోల పటిక లభ్యమైందన్నారు. నల్లబెల్లం సరఫరా చే స్తున్న బాదావత్‌ మాన్‌ సింగ్‌, సపావత్‌ సంతు, బాదావత్‌ సురేష్‌, బానోతు హనుమాన్‌ పై కేసు నమోదు చేశామని తెలిపారు. వారి వద్ద గల స్కూటీ వాహనాన్ని సీజ్‌ చేశామని, నల్లబెల్లం విలువ రూ.1.81లక్షలు ఉంటుందన్నారు

నిధులు కేటాయించాలి

డోర్నకల్‌: డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయించాలని బుధవారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం సురేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సైబర్‌ నేరాలపై  జాగ్రత్త తప్పనిసరి 
1
1/2

సైబర్‌ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి

సైబర్‌ నేరాలపై  జాగ్రత్త తప్పనిసరి 
2
2/2

సైబర్‌ నేరాలపై జాగ్రత్త తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement