రాత పరీక్ష రద్దు చేయాలి
మహబూబాబాద్/నెహ్రూసెంటర్: ఈనెల 29న జరగనున్న ఏఎన్‌ఎం రాత పరీక్షను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయా లని వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ నా యకురాలు నసీమాబేగం డిమాండ్ చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నసీ మాబేగం మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు రాత పరీక్ష నిర్వహించే ఆలోచన విరమించుకుని రెగ్యులరైజ్ చేయాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు. స్నేహలత, అశ్విని, పార్వతి, వనిత ఉన్నారు.
మెరిట్ జాబితా విడుదల
నెహ్రూసెంటర్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్టు ప్రాతిపదికన జిల్లాలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించిన ఫైనల్ మెరిట్ జాబితా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు డీఎంహెచ్‌ఓ మురళీధర్ సోమవారం తెలిపారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి 1:3 నిష్పత్తిలో ఎంపికై న అభ్యర్థుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుందన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేడు (మంగళవారం) ఉదయం 10గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మహబూబాబాద్.తెలంగాణ.జీఓవీ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
తొర్రూరు కోర్టు అసిస్టెంట్
ప్లీడర్‌గా శ్రీనివాస్
మరిపెడ రూరల్: తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన లింగాల శ్రీనివాస్ సోమవారం నియమితులయ్యారు. శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 14 సంవత్సరాలుగా అనేక కేసులను వాదించిన అనుభవంతో పాటు తొర్రూరు కోర్టులో గతంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా ఉచిత సర్వీసు చేసి మంచి గుర్తింపు పొందారు. కాగాశ్రీనివాస్‌ను పలువురు అడ్వకేట్లు, మిత్రులు అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
విద్యార్థుల ఎంపిక
మరిపెడ: జిల్లా కేంద్రంలో ఈనెల 19నుంచి 21వరకు నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో మరిపెడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించారు. లోకేష్, గౌతమి, పూజ, గంగోత్రి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. వీరు ఈనెల 27నుంచి జనవరి 2వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అనంతరావు, బయగాని రామ్మోహన్, జనార్దనచారి, శ్రీశైలం పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలను, మత్తుపదార్థాలను విక్రయించినా, వినియోగించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. యాంటీ నార్కొటిక్ డీఎస్పీ సైదులు మాట్లాడుతూ.. యాంటీ నార్కొటిక్ విభాగం ఆధ్వర్యంలో యువత డ్రగ్స్‌కు అలవాటు పడొద్దని చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులచే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో కేయూ పాలక మండలి సభ్యులు కె.అనితారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి, డాక్టర్ జగదీశ్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్యులు ఈసం నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లా రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment