నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సూచించారు. ఆస్పత్రిని సో మవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి వెంటనే వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళాశక్తి క్యాంటి న్‌ను తనిఖీచేసి రోగులకు నాణ్యమైన ఆహార ప దార్థాలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపా రు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, ఏఓ గఫర్ ఉన్నారు.
కలెక్టర్ తనిఖీ..
బయ్యారం: మండలంలోని కేజీబీవీ, ఎస్సీ బాలుర హాస్టల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్, కిచెన్‌షెడ్, తరగతి గదులు, స్టడీ రూమ్స్, పరిసర ప్రాంతాల ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో విద్య, వైద్యం అందించాలని సూచించారు. పీహెచ్‌సీ పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment