వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 117 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింహస్వామి, డీఈఓ రవీందర్‌రెడ్డి, డీపీఓ హరి ప్రసాద్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ..
ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ టీఫ్రైడ్ స్కీం ద్వారా జిల్లాలో 31మంది ఎస్టీ యువతకు రూ.95,61,860 రుణాల రూపంలో ఇచ్చామని చెప్పారు. ఐదుగురు ఎస్సీ యువతకు రూ.15,89,506 రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జీఎం సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment