‘పది’లో మొదటి స్థానం లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీర బ్రహ్మచారితో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోనీ అన్ని పాఠశాలలు వసతి గృహాల్లోని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసో త్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు కరపత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వ్యాసరచనలు, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ప్రచారం నిర్వహిస్తూ, సామాజిక మాధ్యమాలు రేడియో లోకల్ చానల్స్ ద్వారా, ఆటో లారీ బస్ ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి సైన్ బోర్డులు, బయ్యారం మండలం నామాలపాడు వద్ద అతి ప్రమాదకరంగా ఉన్న ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సహకార సంఘాలతో ఆర్థికాభివృద్ధి
సహకార సంఘాల బలోపేతంతో ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చుని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. మల్టీ పర్పస్ కోపరేటివ్ సొసైటీల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మధ్య పరిశ్రమ, గీతా పరిశ్రమ, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, జన్ ఔషధం వేరు హౌస్, పాల శీతల కేంద్రాలు, బీసీ కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్ల, సొసైటీల ద్వారా జరిగే పథకాల అమలుతోపాటు మరింత వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ సంఘాలను చైతన్య పరుస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావు, ఆర్టీఓ జైపాల్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, పవన్ కుమార్, డీసీడీసీ కన్వీనర్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీవీహెచ్‌ఓ కిరణ్ కుమార్, ఎకై ్సజ్ శాఖ అధికారి కిరణ్, డీసీబీబీ రజిత పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment