ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం
మహబూబాబాద్ రూరల్ : ప్రజల అభిప్రాయాలు తమకెంతో విలువైనవని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. తెలంగాణ పోలీస్ సిటిజెన్ ఫీడ్ బ్యాక్ పోస్టర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసు సేవలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. పోస్టరుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి అందులో తెలుపబడిన విధంగా ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్, ఈచలాన్ (ట్రాఫిక్ ఉల్లంఘనలు), పాస్ పోర్ట్ ధ్రువీకరణ, ఇతర అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్‌ఐలు భాస్కర్, సోములు, సిబ్బంది శ్రీధర్, ఉపేందర్ పాల్గొన్నారు.
ఊర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్త
సంక్రాంతి పండుగ సెలవులకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలన్నారు. ఊరెళ్తున్నామన్నా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలని సూచించారు. సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారమివ్వాలని, సీసీ కెమెరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలియజేయాలని సూచించారు. మహిళలు, వృద్ధులు అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకండని, కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డయల్ 100 ను వినియోగించుకోవాలన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment