మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సో ర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా మైనార్టీ శాఖ అధికారి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో టీజీటీ సైన్స్ పురుషులకు ఒక పో స్ట్, తొర్రూర్ బాలికల మైనార్టీ పాఠశాలలో టీజీ టీ ఇంగ్లిష్ పోస్ట్(మహిళ), డోర్నకల్ మైనార్టీ గురుకుల కళాశాలలో హెచ్‌పీ పోస్ట్(మహిళ ), బాలికల కళాశాలలో అనాటమి ఫిసియోలజి పోస్ట్ (మహిళ) ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. బీఈడీ పూర్తి చేసి, నాలుగు సంవత్సరాల బోధన అనుభవంగల వారు అర్హులని, ఈ నెల 10 నుంచి 18 వరకు సన సెక్యూరిటీ ప్లే స్‌మెంట్ ఏజెన్సీ తాళ్లపూసపల్లి రోడ్డులోని కార్యాలయంలో బయోడేటా, విద్యార్హత జిరాక్స్ పత్రాలను అందజేయాలని తెలిపారు. సందేహాలుంటే చిరంజీవిని 90521 74603 నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
గురుకులాల ప్రవేశాలకు..
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభమైన్నట్లు అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన గురుకులాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఈఓ రవీందర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ రాజేందర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment