జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు జిల్లా విద్యార్థులు
మహబూబాబాద్ అర్బన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలో పెద్దవంగర బీసీ గురుకులం విద్యార్థి అసల్ల దినేశ్ ప్రదర్శించిన బైక్ సెఫ్టీ ప్రైవేటింగ్ అలారం జాతీయస్థాయికి ఎంపికై ంది. గైడ్ టీచర్‌గా కరుణకర్ వ్యవహరించారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్ విద్యార్థి శ్రీకరణ్‌రెడ్డి, జూనియర్స్ విభాగంలో డాక్టర్ గురునాథరావు ఉపాధ్యాయ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరిని డీఈఓ రవీందర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment