పంట మార్పిడి లాభదాయకం
మహబూబాబాద్ రూరల్ : రైతులు వరికి బదులు పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. జిల్లా ఉద్యాన అధికారులు, బిందు సేద్య ప్రతినిధులు, ఆయిల్ ఫెడ్ క్షేత్ర అధికారులతో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ కార్యాలయంలో మరియన్న జిల్లా ప్రగతిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పా మ్ గెలల ధరలు పెరిగాయని, ఆయిల్ పామ్ గెలలు టన్నుకు రూ.20,506 పలుకుతుందని తెలిపా రు. ఆయిల్ పామ్ సాగుకు డ్రిప్, అంతరపంట సా గు, మొక్కలకు, నిర్వహణ తదితరాలకు నాలుగేళ్ల కు కలిపి ఎకరానికి రూ.51 వేలు ప్రభుత్వం రాయి తీ ఇస్తుందన్నారు. పొలం గట్ల మీద, పొలం చు ట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంత ర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారీ అవసరాల నిమిత్తం కూరగాయలను సాగుచేసుకోవాలన్నారు. కూరగాయల సాగులో మే లైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మ ల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆ ముదం పిండి వాడకం, వేప నూనె పిచికారీ చేయ డం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసి న ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సా గు, ట్రెల్లిస్ మెథడ్ ద్వారా టమాటా సాగు మొదలై న పద్ధతులు పాటించాలని సూచించారు. శాంతిప్రియదర్శిని, శాంతిప్రియ, శ్రీనివాసరావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరియన్న
Comments
Please login to add a commentAdd a comment