కామన్ డైట్ మెనూ అమలు చేయాలి
మరిపెడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ నూతన మెనూను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ లెనిల్ వత్సల్ టోప్పో హాస్టల్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మరిపెడ మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం, జూనియర్ కళాశాల, మహత్మాగాంధీ జ్యోతిరావు పూలే వెల్పేర్ బాలికల గురుకలాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్, కిచెన్ గదులు, టాయిలెట్స్, క్లాస్, స్టడీ రూమ్స్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలన్నారు. రాత్రి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, స్వచ్ఛమైన ఆర్వో ప్లాంట్ వాటర్ నీరు విద్యార్థులకు అందించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని, విద్యతోపాటు మానసిక వికాస తరగతులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ లెనిల్ వత్సల్ టోప్పో
మరిపెడలోని పలు గురుకులాల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment