మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశాం..
డోర్నకల్: ఐదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న తెలిపారు. స్థానిక జైన్‌భవన్‌లో ఆదివారం మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి అధ్యక్షతన మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సమావేశం నిర్వహించి చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు 13 మంది కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ వీరన్న మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో కరోనా ప్రభావం, నిధుల కొరత, అభివృద్ధి పనులకు అడ్డంకులు, బిల్లుల మంజూరులో జాప్యంతో పాటు అనేక కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వార్డు కౌన్సిలర్ సురేందర్‌జైన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకంతో గెలిపిస్తే వారు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయామని, దీనిపై బహిరంగం క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, కౌన్సిలర్లు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పఽథకాల అర్హుల ఎంపిక పత్రాలను మహబూబాబాద్ మండలంలోని సండ్రాలగూడెం గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఏఓ తిరుపతిరెడ్డి, ఎంపీఓ పార్థసారథి, ఏపీఎం తిలక్, ఏపీఓ రమేశ్‌రెడ్డి, ఏఈఓ రంజిత్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి
నెహ్రూసెంటర్: ప్రతీ ఒక్కరు రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. ఆదివారం గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని రాజ్యాంగాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ ప్రజలకు, కార్మికులకు ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీ ఒక్కరు రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని, కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బి.అజయ్‌సారథిరెడ్డి, పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నాయకులు ఫాతిమా, వీరవెల్లి రవి, మహమూద్, తోట రాజకుమారి, మాలోత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అతిఉత్కృష్ట సేవా పతకం అందజేత
మహబూబాబాద్ రూరల్ : అర్ముడ్ రిజర్వుడ్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోతుల రాము అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ చేతుల మీదుగా పోతుల రాము పతకం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment