![కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09drk254-330134_mr-1739131193-0.jpg.webp?itok=dTNwcWXP)
కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి
మరిపెడ రూరల్: కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని కంఠమహేశ్వర స్వామి–సురమాంబల కల్యాణ మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చివరి రోజు బలిదానం, మోకు, ముస్తాదుల పూజలు, వన మహోత్సవ కార్యక్రమంతో పండుగ వేడుకలు ముగిశాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యుగేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ అంబరీష, కాలం రవీందర్‌రెడ్డి, విసారపు శ్రీపాల్‌రెడ్డి, గౌడకుల పెద్ద గంధసిరి రామన్న, భిక్షపతి, గుండగాని వెంకన్న, గంధసిరి రవి, పొన్నం వినయ్, లింగమూర్తి, రవి, గౌడ కుల పెద్దలు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
కురవి: మండల కేంద్రంలోని ఆలయం పక్కన నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ ఆదివారం పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్ ఇళ్ల పక్కన వీరభద్రస్వామి ఆలయం కై లాస భవన స్థలాన్ని పరిశీలించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఆలయానికి సంబంధించిన స్థలంలోకి ఎవరు రావద్దని సూచించారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఎర్ర నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే
జాటోతు రాంచంద్రునాయక్
Comments
Please login to add a commentAdd a comment