బొమ్మల చదువు..
డోర్నకల్: చిన్నారులను ఆకట్టుకునేలా అంగన్‌వాడీ కేంద్రాలు ముస్తాబవుతున్నాయి. డోర్నకల్ మున్సిపాలిటీతో పాటు మండలంలో 106 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 18 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. గతంలో అమ్మపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా గుర్తించి భవనం గదులకు రంగులతో బొమ్మలు వేయడంతో పాటు వసతులు కల్పించారు. ఇటీవల జిల్లాలో 40 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వప్రాథమిక పాఠశాలలుగా మార్చి రంగురంగుల బొమ్మలతో ముస్తాబు చేశారు. డోర్నకల్ మండలంలో కస్నాతండా, హరిశ్చంద్రుతండా కేంద్రాలను పూర్వపాఠశాలలుగా మార్చారు. తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాలలు, శరీర భాగాల వివరాలు, వివిధ రకాల జంతువులు, నెలల పేర్లు, పలు ఇంగ్లిష్ పదాలు, పిల్లల దినచర్య, పాఠశాలలో భోజనాలకు సంబంధించిన వివరాలతో గోడలపై బొమ్మలు చిత్రించారు. ఈ బొమ్మలు చిన్నారులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. పూర్వ ప్రాథమిక పాఠశాలకు వస్తున్న పిల్లలకు గోడలపై బొమ్మలతో బోధించడం తేలికగా ఉందని, పిల్లలు కూడా ఉత్సాహంగా అక్షరాలు, పదాలను నేర్చుకుంటున్నారని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో రంగురంగల బొమ్మలతో అలకంరణ
చిన్నారులను ఆకర్శిస్తున్న సెంటర్లు
Comments
Please login to add a commentAdd a comment