ఆస్పత్రుల్లో అస్తవ్యస్తంగా వ్యర్థాల నిర్వహణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో వెలువడుతున్న బయోమెడికల్ వ్యర్థాల సేకరణ నిబంధనల ప్రకారం సాగడం లేదు. ఆస్పత్రుల్లో పోగుపడుతున్న బయో మెడికల్ వ్యర్థ్యాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తూ డంపింగ్‌యార్డులకు చేరుస్తుండటంతో సిబ్బంది అనారోగ్యం బారిన పడాల్సివస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బయోమెడికల్ వ్యర్థాల సేకరణను ప్రభుత్వం ఓ ప్రైవేటు ఇన్సినరేటరీ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థలు 11 ఉన్నాయి. ఆయా సంస్థలతో ఆస్పత్రులు అనుసంధానమై బయో మెడికల్ వేస్టేజ్‌ను అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత ఏజెన్సీకి ఆస్పత్రులు ఒక్కో బెడ్‌కు రూ.7 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆస్పత్రుల నుంచి బయో మెడికల్ వేస్టేజ్ సేకరణ సక్రమంగా సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్లక్ష్యంగా మెడికల్ వేస్టేజ్ సేకరణ
నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చెత్త ట్రాక్టర్లకు అందజేత
వ్యర్థాలను చెత్తలో కలిపేయడంతోమరింత ప్రమాదం
డబ్ల్యూహెచ్‌ఓ, పీసీబీ నిబంధనలు బేఖాతరు
పట్టించుకోని వైద్య, ఆరోగ్యశాఖఅధికారులు
Comments
Please login to add a commentAdd a comment