‘మత్తు’ వదలరా..!
మోతాదుకు మించితే..
ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసే సమయంలో రోగులకు నొప్పి తెలియకుండా ఉండేందుకు వైద్యులు అవసరమైన మోతాదులో మత్తును ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్‌ను అవసరమైన దానికంటే ఎక్కువగా వినియోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అలవాటు పడిపోతారు. ఇలాంటి మత్తు ఇంజక్షన్లతో నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారు అందుబాటులో లేకపోతే ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తను గాయపర్చుకోవడం లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
డ్రగ్స్‌పై అవగాహన..
మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జూనియర్ కళాశాలల నుంచి వైద్య కళాశాల, యూనివర్సిటీ ఇలా అన్ని కళాశాలల్లో ఈ నెల నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– డి.జానకి, ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: విద్యార్థి దశ కీలకం.. భవిష్యత్ ఈ దశపైనే ఆధారపడి ఉంటుంది. ఈ దశలో కొందరు యువత చెడు అలవాట్లకు చేరువవుతుంటారు. మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావడం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇలాంటి యువతను లక్ష్యంగా చేసుకొని మత్తులో దింపేందుకు గంజాయి వ్యాపారులు ప్రయత్నిస్తుంటారు. కళాశాలల్లో చదివే కొందరు విద్యార్థులు గంజాయి, సిగరేట్లకు బానిసై.. అవి లేకుంటే ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. సిగరేట్లలో గంజాయి పెట్టి విక్రయిస్తున్నారు. జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల కట్టడికి కలెక్టర్‌తో పాటు ఎకై ్సజ్, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రధానంగా వైద్య, నర్సింగ్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రతి గురువారం ఒక కళాశాలలో..
ఈ నెల నుంచి జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రతి గురువారం ఒక కళాశాలలో గంటన్నర పాటు వర్క్‌షాప్ నిర్వహించి మత్తు పదార్థాలు.. వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నత అధికారులు సదస్సుకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 17న పాలమూరు యూనివర్సిటీ, 24న నర్సింగ్ కళాశాల ఇలా వేర్వేరు తేదీల్లో వేర్వేరు కళాశాలల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తూ ప్రతి కళాశాలలో పోలీసు కళాజాతా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రత్యేక శిక్షణ..
యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్న కొన్ని శాఖల నుంచి పలువుర్ని పిలిపించి ఎకై ్సజ్, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇంటర్ విద్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఇలా ఒక్కో విభాగం నుంచి ఒకరిని ఎంపిక చేసి డ్రగ్స్ కంట్రోల్ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరున శిక్షణ ఇవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వచ్చే నెలకు వాయిదా పడింది. శిక్షణ పొందిన అధికారులు ఆయా కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేసి డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై అవగాహన కలిస్తారు.
జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కార్యాచరణ
కళాశాలల్లో ప్రత్యేక అవగాహనకార్యక్రమాలు
వైద్య, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలపై ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment