క్షణికావేశం.. కుటుంబాలకు శాపం
●
క్షణాకావేశం.. అనేక అనర్థాలకు మూలం.. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే నేటి యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవాలనే తప్పా ఆత్మహత్యే శరణ్యం అంటూ కుటుంబాలను ఇక్కట్లు పాలు చేస్తున్నారు. ప్రేమ వ్యవహరాలు.. ఆర్థిక సమస్యలు.. భార్యాభర్తల గొడవలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని కాస్త ఓదార్చి మనోధైర్యాన్ని ఇస్తే బలవనర్మణాలను ఆపవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 163మంది ఆత్మహత్యలకు పాల్పడటం భయాందోళనకు గురిచేస్తోంది.
సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి
చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొవాలి. ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమవ్యవహారాలకు సంబంధించినవి ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్లలో సంప్రదించాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. జిల్లాలో ఆత్మహత్యల నివారణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
– గైక్వాడ్ వైభవ్ రఘునాథ్,
ఎస్పీ, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రస్తుత పరిస్ధితుల్లో కొందరు ఏదైనా సమస్య వస్తే వాటిని ఎదుర్కొలేక ఆత్మహత్యే శరణ్యమంటూ కుటుంబాలకు దూరమవుతున్నారు. జిల్లాలో చాలామంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి తమ నిండు జీవితాలను బలితీసుకుని కుటుంబాలల్లో విషాదం నింపుతున్నారు. ఈ సంస్కృతి రోజు, రోజుకు పెరిగిపోతుండటంతో కొంత ఆందోళన నెలకొందది. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతిఒక్కరిపై ఉంది. ఆత్మహత్యలకు పాల్పడితే జరిగే పరిణామాలపై జిల్లా పోలిసుశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో ఈఏడాదిలో ఇప్పటివరకు వివిధ కారణాలతో 163మంది ఆత్మహత్యకు పాల్పడటం భయాందోళనను కలిగిస్తోంది. వీటి నివారణకు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది.
ఆందోళన కలిగిస్తున్నాయి..
జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యల సంఘటనలు పలువురిని ఆందోళన కలిగించేలా ఉన్నాయి. చిన్నచిన్న విషయాలకు క్షణికావేశంలో ఉరేసుకోవడం, పురుగుమందు తాగడం వంటివి చేసి తనువు చాలిస్తున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న ఆత్మహత్యలలో ఎక్కువశాతం భార్యాభర్తల గొడవలు, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు
ప్రేమ విఫలమై కొందరు,
భార్యాభర్తల గొడవలతో మరికొందరు
ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది
ఈ ఏడాది జిల్లాలో
163 కేసులు నమోదు
Comments
Please login to add a commentAdd a comment