లింగాల: అప్పుగా తీసుకున్న రూ.200 చెల్లించలేదని అప్పు ఇచ్చినవారు దాడికి పాల్పడగా ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండలంలోని అవుసలికుంటలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురుమయ్య అదే గ్రామానికి చెందిన గుండూరు శ్రీను వద్ద కొన్నిరోజుల క్రితం రూ.200 అప్పుగా తీసుకున్నాడు. ఇటీవలే ఆ డబ్బులను తిరిగి చెల్లించినట్లు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. డబ్బులివ్వ లేదని భావించిన శ్రీను అతని తమ్ముడు ఇంటి వద్ద ఉన్న కురుమయ్యతో గొడవకు దిగారు. ఇది గమనించి ఇరుగు పొరుగు వారు సర్ది చెప్పి వారిని పంపించేశారు. కొద్దిసేవటి తర్వాత శ్రీను, అతను తమ్ముడు మళ్లీ కురమయ్య ఇంటికి వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అతను సృహతప్పి పడిపోగా కుటుంబ సభ్యులు లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment