ప్రైవేట్ కళాశాలలకు జరిమానా
●
అనుమతులివ్వాలి..
హైదరాబాద్‌లో కొనసాగే కార్పొరేట్ కళాశాల మాదిరిగా జిల్లా, మండల కేంద్రాల్లోని కళాశాలలను పోల్చడం ఇబ్బందికరమైన విషయం. చాలామంది నిరుద్యోగ యువత కేవలం ఉపాధి కోసమే కళాశాలలు నిర్వహిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అదనపు ఫీజులు లేకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. పరీక్ష ఫీజులు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
– విజేత వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ప్రైవేటు కళాశాలల సంఘం, మహబూబ్‌నగర్
రూ.లక్ష
జరిమానా విధించారు..
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ ఉన్న కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో 14 కళాశాలలు ఉండగా.. ప్రభుత్వం ఒక్కో కళాశాలకు రూ.లక్ష జరిమానా విధించింది. వీటలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు పరీక్ష ఫీజుపై అదనంగా రూ.2,500 చెల్లించాలని సూచించింది. ఫీజులు చెల్లించని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుర్తింపు ఉన్న కళాశాలల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేసి పరీక్ష రాయించే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధంగా కావాలి.
– కౌసర్ జహాన్, జిల్లా ఇంటర్మీడియర్‌శాఖ అధికారి, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఏటా ప్రవేశాలు తగ్గుముఖం పడుతుండగా.. తాజాగా సంవత్సర గుర్తింపు రాకపోవడం మరో సమస్యగా మారింది. ప్రధానంగా మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతుండటం, ఫైర్ సేఫ్టీ అనుమతులు రాకపోవడం విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం నేడో రేపో అనుమతులు ఇవ్వకపోదా అని యాజమాన్యాలు ఇన్ని రోజులు ఎదురుచూసినా.. చివరకు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో నిరాకరించడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలంటే రూ.లక్ష చెల్లించాలంటూ కళాశాలల లాగిన్‌లో చూపిస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కళాశాలల నిర్వహణ, భవనాల అద్దెలు భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు చెల్లించలేమని.. ప్రభుత్వంతో మరోదఫా చర్చలు జరపాలని భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుర్తింపురాని కళాశాలలు 21 ఉండగా అందులో మహబూబ్‌నగర్ 14, వనపర్తి 4, నారాయణపేట 2, నాగర్‌కర్నూల్ 1 ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉండగా.. సుమారు 5,600 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు..
గుర్తింపు లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కావున ఆయా విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పిస్తుందని ఇంటర్మీడియట్‌శాఖలో చర్చ నడుస్తోంది. ఆయా కళాశాలల నుంచి హాల్‌టికెట్లు, మెమోలు జారీ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ ఉన్న వాటికే..
రూ.లక్ష చెల్లిస్తేనే గుర్తింపునిచ్చే అవకాశం
సందిగ్ధంలో యాజమాన్యాలు, విద్యార్థులు
ప్రభుత్వ కళాశాలల నుంచి అనుమతించే యోచనలో ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment