దర్జాగా తవ్వుతున్నారు..
జడ్చర్ల, బూరెడ్డిపల్లి శివార్లలోని గుట్టలను యథేచ్ఛగా తవ్వుతున్నారు. బ్లాస్టింగ్లు పెట్టి బండలను పిండి చేస్తున్నారు. టిప్పర్లలో మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.
– నర్సిములు, బూరెడ్డిపల్లి
గుట్టల ఉనికికి ప్రమాదం..
జడ్చర్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న గుట్టల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. విచ్చలవిడిగా ధ్వంసం చేయడంతో పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రియల్ వ్యాపారులు, మట్టి మాఫియా మూకుమ్మడిగా గుట్టలను నాశనం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– మహిపాల్‌రెడ్డి రెడ్డి, జడ్చర్ల
చర్యలు తీసుకోవాలి..
శంకరాయపల్లి, జడ్చర్ల చుట్టు పక్కల ప్రాంతాలలో రేయింబవళ్లు గుట్టలను తొలచి మట్టిని రవాణా చేస్తున్నారు. దీంతో గుట్టలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. మైనింగ్ మాఫియాపై చర్యలు చేపట్టే విధంగా అధికారులు స్పందించాలి. క్షేత్రస్థాయిలో విచారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– గోపాల్‌నాయక్, శంకరాయపల్లి
ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు
గుట్టల తవ్వకాలకు పాల్పడే వారిపై నిబంధనల మేరకు చర్యలు చేపడుతాం. హౌసింగ్ బోర్డు వెనుకాల గల గుట్టల తొవ్వకాలకు సంబంధించి మైనింగ్ శాఖ అధికారులతో కలిసి విచారించి చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలకు, తరలింపునకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.
– బ్రహ్మంగౌడ్, తహసీల్దార్, జడ్చర్ల
●
Comments
Please login to add a commentAdd a comment