మహబూబ్నగర్ (వ్యవసాయం): మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ పంట కొనుగోళ్లు జరగవని చైర్పర్సన్ బెక్కరి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన 27,035 బస్తాల వేరుశనగ మార్కెట్కు వచ్చిందని, ఆ బస్తాలను లిఫ్టింగ్ పూర్తికానందున గురువారం యార్డుకు వచ్చే వేరుశనగ పోయడానికి స్థలం లేదని, దాంతో మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 31వ తేదీన తిరిగి యథావిధిగా పంట క్రయవిక్రయాలు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment