![భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mbnrl853-210066_mr-1738869781-0.jpg.webp?itok=ICRx3gk5)
భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దేవాలయం వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఫిబ్రవరి 12న స్వామి వారి రథోత్సవం, మార్చి 14న అమ్మవారి తిరు కల్యాణం, విమాన రథోత్సవం రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయా రోజుల్లో పోలీసుశాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, తగినన్నీ ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. రథోత్సవం సందర్భంగా కొండపైకి ఫిట్‌నెట్ ఉన్న మినీ బస్సులను నిరంతరం నడపాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ తరఫున కొండపైన, కొండ దిగువన అలివేలు మంగతాయారు దేవాలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు వైద్యసిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, జనరేటర్ ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక శాఖ ద్వారా కొండపైన, దిగువన అవసరమైన అగ్నిమాపక సాధనాలతో సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆలయ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో మద్యపానాన్ని నిషేధించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసే దుకాణాలలో అమ్మే తిను బండారాలు, ఆహార పదార్థాలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసి మానిటర్ చేయాలని కోరారు. కోనేరులో ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయాలని, ప్రతిరోజూ నీటి సరఫరా చేయాలన్నారు. టాయిలెట్‌లు, పార్కింగ్, తాగునీరు ప్రాంతాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కొండపైకి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శాంతి భద్రత కమిటీ, ఫెస్టివల్ కమిటీ, వాటర్, శానిటేషన్ కమిటీ, ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండ బ్రహ్మోత్సవాలను
ఘనంగా నిర్వహించాలి
రద్దీ రోజుల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి
అధికారుల సమీక్షలో
కలెక్టర్ విజయేందిర బోయి
Comments
Please login to add a commentAdd a comment