![కల్లు సీసాలో ఎలుక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ngkl902-210153_mr-1738869734-0.jpg.webp?itok=TJYTpAsE)
కల్లు సీసాలో ఎలుక
బిజినేపల్లి: కల్లు సీసాలో ఎలుక కనిపించిన ఘటన మండలంలోని గుడ్లనర్వలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఒక ఇంట్లో శుభకార్యం ఉండటంతో కల్లు ప్రియుల కోసం కల్లు సీసాలను తీసుకొచ్చారు. ఓ సీసాలో ఎలుక ఉండటం గుర్తించి దానిని బయటికి తీసే ప్రయత్నం చేయగా మూతి భాగంలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని ఎకై ్సజ్‌శాఖ అధికారి సతీశ్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. కల్లు దుకాణం నుంచి నమూనాలు సేకరించామని, కల్లును పారబోశామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొండాపూర్‌లో చిరుత కలకలం
నవాబుపేట: మండలంలోని కొండాపూర్‌కు చెందిన రైతు యాదయ్య పొలంలో ఉన్న మేకపై బుధవారం రాత్రి చిరుత దాడిచేసింది. కుక్కలు ఒక్కసారిగా అరవడంతో పరిసరాల్లో ఉన్న రైతులు టార్చిలైట్లు వేస్తూ వెళ్లారు. మేకను చంపేసిన చిరుత వారిని చూసి అడవిలోకి పారిపోయింది. మేక కళేబరాన్ని చూసిన రైతులు భయాందోళనకు గురై గ్రామానికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment