స్పందించే గుణం కవుల సొంతం
11 నుంచి
సదరం క్యాంపులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వికలత్వ పరీక్షలు నిర్వహించేందుకు ఈ నెల 11వ తేది నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ నర్సిములు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా దరఖాస్తుదారులతో పాటు రెన్యూవల్ చేసుకునే దివ్యాంగులు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. స్లాట్‌లో వచ్చిన మెసేజ్ ఆధారంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో సదరం క్యాంపులకు హాజరుకావాలని సూచించారు.
జాతీయ యోగా పోటీలకు 8 మంది ఎంపిక
మహబూబ్‌నగర క్రీడలు: తిరువనంతపూర్‌లో ఈ నెల 11 నుంచి 15 వరకు జరగనున్న జాతీయ సీనియర్ యోగా పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రాములు, బాల్‌రాజు తెలిపారు. శ్రీకాంత్, ప్రకాశ్, మధు, సాగర్, వెంకటేశ్, బాలమణి, స్వప్న, శ్వేత ఎంపికయ్యారని, వీరు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు.
40 మున్సిపల్
షాపులు సీజ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక క్లాక్‌టవర్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 40 మంది లీజ్‌దారులు సుమారు రూ.ఎనిమిది కోట్ల అద్దె బకాయిపడ్డారు. ఇటీవల వారికి మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా ఆధ్వర్యంలో అన్ని షాపులను సీజ్ చేశారు. ఇప్పటికై నా వాటి అద్దెలు చెల్లించాలని దుకాణదారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు అహ్మద్‌షరీఫ్, రమేష్, ముజీబుద్దీన్, రాజ్‌కుమార్, టి.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై విద్యార్థులు
అవగాహన పెంచుకోవాలి
పాలమూరు: విద్యార్థి దశ నుంచే అన్ని రకాల చట్టాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతాయని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీడీడీ బాలుర వసతి గృహం(ఆనందనిలయం) ను ఆమె సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులు, పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. బాలలతో మాట్లాడి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం నగరంలోని సాందీపని ఆవాసాన్ని సందర్శించారు. అక్కడ లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి గల్ సర్వీస్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్, బాల్య వివాహాలు, బాలల హక్కులు, నల్సా పథకాలను విద్యార్థులకు వివరించారు.
చిన్నారులను కళల్లో ప్రోత్సహించాలి
ప్రముఖ సినీ రచయిత
సుద్దాల అశోక్ తేజ
ముగిసిన సుద్దాల హనుమంతు
సాంస్కృతిక ఉత్సవాలు
వివరాలు 8లో..
స్పందించే గుణం కవుల సొంతం
Comments
Please login to add a commentAdd a comment