దేవస్థానం చరిత్ర..
దాదాపు 600 ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో ఉన్న అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి, కృష్ణా నదీ తీర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలసి ఉన్నానని.. అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించి అంతర్దానం అయ్యారని పురాణం చెబుతోంది. శ్రీనివాసుడి సూచన మేరకు అళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్య, కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో నివాసం ఏర్పర్చుకున్నారు. దక్షిణాది గల దివ్యక్షేత్రాలను ఆయన దర్శించుకుంటూ.. ఒక రోజు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం సూర్యభగవానుడికి నమస్కరించి, దోసిలితో ఆర్ఘ్యం వదులుతున్న సమయంలో చెక్కని శిలారూపంలో గల వేంకటేశ్వరస్వామి విగ్రహం నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్ఠించి.. నిత్య దూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడ్వాలర్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేయడంతో మన్యంకొండగా ప్రసద్ధికెక్కింది. దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది. కొన్నేళ్ల పాటు మన్యంకొండపై పూజలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే పూజలు ఆగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment