డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ | Sakshi
Sakshi News home page

డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ

Published Sun, May 5 2024 3:10 AM

డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లా ఇంచార్జీ వ్యవసాయ అధికారిగా బెల్లంపల్లి, మంచిర్యాల సహాయ వ్యవసాయ అధికారి(ఏడీఏ) సురేఖ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) కల్పన కొంతకాలంగా సెలవులో ఉన్నారు. గత నెలలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని, కార్యాలయ, ఎన్నికల విధులకు హాజరు కాలేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సెలవు పత్రం అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఆదేశాలతో సురేఖకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీ డీఏవోను ఏవో, ఏఈవోలు, సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Advertisement
Advertisement