జనావాసంలోకి దుప్పి | Sakshi
Sakshi News home page

జనావాసంలోకి దుప్పి

Published Sun, May 5 2024 3:30 AM

జనావా

పెంచికల్‌పేట్‌: మండలంలోని అగర్‌గూడ అట వీ ప్రాంతం నుంచి శనివారం గ్రామ సమీపంలోకి వచ్చిన చుక్కలదుప్పిని అడవిలో వది లిపెట్టినట్లు బీట్‌ అధికారి వెంకటేష్‌ తెలిపారు. అటవీ ప్రాంతంలో స్థానిక ట్రాకర్‌ల సహాయంతో గస్తీ తిరుగుతున్న సమయంలో అడవి కుక్కల దాడితో దుప్పి బొక్కివాగు సమీపంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది సహాయంతో చికిత్స అందించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీవో అరుణ్‌, వాచర్లు సాగర్‌, లచ్చన్న, వాజీద్‌ పాల్గొన్నారు.

లారీ ఢీకొని మూడు గేదెలు మృతి

ఆసిఫాబాద్‌రూరల్‌: లారీ ఢీకొని మూడు గేదెలు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. బూర్గుడ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు రోడ్డు దాటుతుండగా మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా ఒక గేదెకు తీవ్రగాయాలయ్యాయి. గేదెలు చిర్రకుంట గ్రామానికి చెందిన మద్దెల రాజన్నవిగా గుర్తించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

వాంకిడి: అక్రమంగా త రలిస్తున్న రేషన్‌ బి య్యం పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్‌మెంట్‌ డీటీలు రాజ్‌కుమార్‌, శ్యాంలా ల్‌ తెలిపారు. మండలానికి చెందిన సోహెల్‌ 20.10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం వాహనంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా ఆర్లీ ఎక్స్‌రోడ్‌ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యం సీజ్‌ చేసి ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్‌లో అప్పగించి, నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: మండలంలోని బూర్గుడలో పీడీఎస్‌ బియ్యం పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రాజ్‌కుమార్‌, శ్యాంలాల్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన పుల్లూరి వెంకటేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా నిల్వ ఉంచిన 3.80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యం సీజ్‌చేసి నిందితునిపై 6 ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జనావాసంలోకి దుప్పి
1/2

జనావాసంలోకి దుప్పి

జనావాసంలోకి దుప్పి
2/2

జనావాసంలోకి దుప్పి

Advertisement
Advertisement