కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
దస్తురాబాద్: కడుపునొప్పి భరి ంచలేక మహిళ ఆత్మహత్య చే సుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకా రం మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన సీమల శృతి (24) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నెల 2న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
యువకుడు బలవన్మరణం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బంగాల్‌పేట్ సమీపంలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ (28)రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఉంటున్న అత్తగారింటికి వచ్చాడు. సోమవారం ఉదయం సమీపంలో ఉన్న మామిడి తోటలో ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి గణపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment