అట్టహాసంగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్– 16 సబ్ జూనియర్స్ బాల, బాలికల ఫాస్ట్–5, ట్రెడిషనల్ నెట్‌బాల్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ నేతృత్వంలో, జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులు(ఈనెల 8, 9 ,10 వ తేదీల్లో) ఈ పోటీలు జరగనున్నాయి. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మొదటి రోజు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులు ఆటల్లో సత్తాచాటి జాతీయస్థాయిలో పతాకాలు సాధించాలని ఆకాంక్షించారు. నెట్‌బాల్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్యరెడ్డి, సెక్రెటరీ ఖాజాఖాన్, ట్రెజరర్ సోహెల్ రెహమాన్, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, సెక్రెటరీ మోహన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పోటీల్లో 24 జిల్లాల నుంచి 48 జట్లు, మొత్తం 850 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 48 మంది కోచ్‌లు హాజరయ్యారు. మొదటిరోజు బాలుర విభాగంలో నాగర్ కర్నూల్–మంచిర్యాల్, మెదక్ –మహబూబ్‌నగర్ జట్లు తెలపడ్డాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ –వనపర్తి , నిర్మల్– మహబూబాబాద్ జట్లు తలపడ్డాయి. కార్యక్రమంలో ఆమెడ కిషన్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్, సీనియర్ నెట్‌బాల్ ప్లేయర్ రేష్మ, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నపూర్ణ, జమున, క్రీడాకారులు పాల్గొన్నారు.
ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
24 జిల్లాల నుంచి 850 మంది
క్రీడాకారులు హాజరు
జాతీయ స్థాయికి ఎంపికవుతా..
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికవుతా. ఇప్పటి వరకు రెండు జాతీయస్థాయి, 10 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే నా లక్ష్యం
– అఖిల, ఖమ్మం జట్టు
Comments
Please login to add a commentAdd a comment