ఆర్జీయూకేటీలో ముగిసిన ఏఐ సదస్సు
భైంసా: ఆర్జీయూకేటీ బాసరలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఏఐ) అనే అంశంపై నిర్వహించిన సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సమావేశానికి ఇన్చార్జి వీసీ గోవర్ధన్ హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అన్ని రంగాల్లో కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. సాధనలకు ఉపయోగించే కోడింగ్‌తో సాప్ట్వేర్ల రూ పకల్పన, కమ్యూనికేషన్ డాక్యుమెంటేషన్ ఎంతో ఉపయోగపడుతోందని సూచించారు. ఆర్టిఫీషియ ల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అమలు చేయడంలో సవాళ్లు, భవిష్యత్ పోడకలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించడం జరిగిందని సమన్వయకర్త డాక్టర్ రాకేశ్ నామని తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారి రణధీర్ సాగి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment