గంజాయి ముఠా అరెస్టు
● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రవాణా ● వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్లు
జైపూర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అక్రమంగా జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నలుగురి వ్యక్తులను అరెస్టు చేసి 1.380 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్‌లో ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు మంచిర్యాల–చెన్నూర్ 63వ జాతీయ రహదారిపై నర్వగ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేపట్టారు. పోతారాజుల ఆకాశ, దూట రాజ్‌కుమార్, షేక్ అఫ్రీది, తోట ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా సీలేరు గ్రామం నుంచి గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి జైపూర్ మండల చుట్టుపక్కల గ్రామాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment