బొగ్గు నాణ్యత పాటించాలి
శ్రీరాంపూర్: బొగ్గు నాణ్యత ప్రమాణాలు పాటించాలని శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాల జెండా ఆవిష్కరించారు. అధికారులు, ఉద్యోగులతో బొగ్గు నాణ్యత పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ మురళీధర్, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ కాస్ట్ గనిలో..
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహించారు. గని మేనేజర్ బ్రహ్మాజీ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. గని రక్షణాధికారి సంపత్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ నల్లపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు విక్రయిస్తోందని ఏరియా ఇన్‌చార్జి జీఎం విజయ్‌ప్రసాద్ అన్నారు. గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా ఏరియాలోని జీఎం ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment