ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి
లక్సెట్టిపేట: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గుల్లకోట గ్రామంలో ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా లక్ష్మీప్రస న్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెరటికోళ్ల మదర్ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాంటీ న్లు, మీ సేవా కేంద్రాలు, డెయిరీ ఫామ్, పెరటికో ళ్ల పెంపకం, కోళ్లఫామ్ ఏర్పాటుతోపాటు అనేక అంశాల ద్వారా అవకాశం కల్పిస్తోందని తెలిపా రు. అనంతరం మండలంలోని గుల్లకోట, బలరావుపేట, జెండా వెంకటాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రై తులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొ చ్చేటపుడు నిబంధనలు పాటించాలని తెలిపారు.
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలు, నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు దూరమవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐహెచ్‌హెచ్‌ఎల్ కింద రూ.12 వేలు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. హాజీపూర్, కర్ణమామిడి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్న, దొడ్డు రకం ధాన్యం వివరాలు తెలుసుకుని ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో కిషన్, తహసీ ల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసా ద్, ఎంపీవో షరీఫ్, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment