ఇంజినీరింగ్‌లో ఫిజిక్స్ కీలకం
● ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీ గోవర్థన్
భైంసా: ఇంజినీరింగ్ విద్యలో ఫిజిక్స్ చాలా కీలకమని ట్రిపుల్‌ఐటీ వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ చండీగర్ సంయుక్తంగా మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ గోవర్థన్ మాట్లాడుతూ రెండువారాలు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంజినీరింగ్ ఫిజిక్స్‌పై కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇంజినీరింగ్‌లో ఫిజిక్స్ కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. అధ్యాపకులు తమ రంగాలలో అత్యాధునిక సాంకేతికతో తమకు తాము నైపుణ్యత పెంచుకోవాలని సూచించారు. దీంతో విద్యార్థులకు మెరుగైన బోధన చేయవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో అధ్యాపకుల నైపుణ్యతకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సదస్సులు అధ్యాపకులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. సదస్సులో ఐఐటీ, ఎన్‌ఐటీ నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ సదస్సులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రణదీర్‌సాగె, డాక్టర్ దేవరాజ్, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment