బట్టీల్లో బాల్యం
బడికి దూరంగా ఉంటూ ఇటుక బట్టీల్లో ఆడుకుంటున్న పిల్లలు
బడికి వెళ్లాల్సిన బాల్యం నిర్మల్ జిల్లాలో ఇటుక బట్టీల్లో బందీ అవుతోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ఈ బాలలను బడిబాట పట్టించడంలో విఫలమవుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం తంశా, సిద్దాపూర్, కౌట్ల శివారులోని ఇటుక బట్టీలలో ఒడిశా, మహారాష్ట్రకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వారి పిల్లలను బడికి పంపించడం లేదు. పాఠశాల ఊరికి దూరంగా ఉండడం ఒక కారణమైతే.. స్థానికేతరులు కావడం మరో కారణం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఏటా తనిఖీలు చేస్తున్న విద్యాశాఖ అధిరులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు బట్టీల్లోని బాల్యాన్ని పట్టించుకోవడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment