విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి

Published Wed, Nov 20 2024 12:12 AM | Last Updated on Wed, Nov 20 2024 12:12 AM

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి

● ఎమ్మెల్సీ కోదండరాం ● స్వగ్రామంలో ఆత్మీయ సమ్మేళనం

నెన్నెల: సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలకమైనవని, ఈ రెండు రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్వగ్రామం జోగాపూర్‌లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వచ్చిన కోదండరాంతోపాటు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటు అందించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. అనంతరం మైలారం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వాగత సమావేశానికి హాజరయ్యారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన బాలబాలికలకు ప్రతీ దసరాకు నగదు బహుమతి ఇస్తామని చెప్పా రు. పాఠశాలల పెండింగ్‌ బిల్లుల మంజూరుకు, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గట్టు మల్లేశ్‌, హరీశ్‌గౌడ్‌, దండనాయకుల ప్రకాశ్‌రావు, మల్లాగౌడ్‌, చెన్నోజి శంకరయ్య, రణవీర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి

భీమారం: సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నా రు. రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని కాజిపల్లిలో నిర్వహించిన 71వ అఖిలభారత సహకార వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఉత్త మ సహకార సంఘాల మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. పేద మహిళలకు దుప్పట్లు, చీరెలు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము అశోక్‌యాదవ్‌, నాయకులు బేరి రాంచెందర్‌యాదవ్‌, రైతు సంఘం నాయకుడు ప్రకాశ్‌రెడ్డి తదితరులున్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

జైపూర్‌: విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకు వచ్చిన ఆయనకు ఇందారం వద్ద కాంగ్రెస్‌ పార్టీ, పలు సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జైపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement