విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
● 2027 ఏప్రిల్ 21 నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ● బీజేపీ నేతలది అవగాహనరాహిత్యం ● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రెమ్‌సాగర్‌రావు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని, జిల్లాలో 2027 ఏప్రిల్ 21 నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ నెల 21న భూమి పూజ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమి పూజకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క హాజరవుతారని అన్నారు. ఆసుపత్రి నిర్మాణంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రావు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని, సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి అనుమతి లేదని, మాతాశిశు ఆసుపత్రికి మాత్రమే అనుమతి ఉన్నాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 650 పడకలతో ప్రారంభం కానున్న సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని భవిష్యత్‌లో 1200 పడకల స్థాయికి తీసుకెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి రూ.350 కోట్లు అవసరం కాగా మొదటిసారి బడ్జెట్‌లో రూ.50కోట్లకు ఆమోదం తెలిపారని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment