కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మొత్తం రూ.360కోట్లతో 650పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. జీప్లస్ 6అంతస్తుల్లో రెండు ప్రధాన ఆసుపత్రి భవనాలు, సర్వీస్ బ్లాక్ ఉండనుంది. అంతేగాక ప్రస్తుతం గోదావరి ఒడ్డున ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. మొత్తంగా నాలుగు బ్లాక్‌లుగా ఆసుపత్రి కొనసాగనుంది. సెక్యూరిటీ, ఆక్సిజన్ ప్లాంట్, సర్వీస్ బ్లాక్‌లు, రవాణా, అంబులెన్సు, ఎస్టీపీ, ఈటీపీ, బయోవేస్టేజ్ తదితరవన్నీ ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనునున్నారు. మొత్తం 4.33ఎకరాల్లో ఈ మేరకు భవన నిర్మాణాన్ని అత్యాధునికంగా నిర్మించేందుకు సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో 1200పడకలకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తున్నారు. ఇక జిల్లా ఆసుపత్రి సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు, పట్టణ నడిబొడ్డున ఉండడంతో అందరికీ సులువుగా రవాణాకు వీలు కలుగుతుంది. ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ప్రస్తుతం మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో వచ్చాయి. భవిష్యత్తులో ఇక్కడే వైద్య విద్యార్థులు వైద్యులుగా రాణించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో పీజీ కాలేజీగా అప్‌గ్రేడ్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రుల భవన నిర్మాణాలు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తయితేనే జిల్లా వాసులకు ఊరట కలుగనుంది. భవన నిర్మాణాల జాప్యం లేకుండా ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. పనులు వేగంగా పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment