‘దళారులను నమ్మి మోసపోవద్దు’
చెన్నూర్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే పత్తి అమ్ముకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ కాటన్ కంపెనీలో సీసీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తినే సీసీఐ కొనుగోలు చేస్తుందని, రైతులు నిబంధనల ప్రకారం పత్తి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఎకరానికి 16 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులు, సీపీవో రవీందర్ నాయక్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి పాల్గొన్నారు.
జిన్నింగ్ మిల్లుల సందర్శన
తాండూర్: మండలంలోని రేపల్లెవాడ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పత్తిలో అధిక తేమ శాతం లేకుండా చూసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఓటీపీ రావడం జాప్యం అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment