విద్యుత్ సమస్యల పరిష్కారానికే లోకల్‌కోర్ట్
● సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ ఎరుకల నారాయణ ● వినియోగదారుల పరిష్కార వేదికకు విశేష స్పందన
రామకృష్ణాపూర్: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ధ్యేయంగా సీజీఆర్‌ఎఫ్(కన్జూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ ఫోరం) కృషి చేస్తోందని సీజీఆర్‌ఎఫ్(నిజామాబాద్) చైర్‌పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. క్యాతనపల్లిలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మంచిర్యాల రూరల్ సబ్ డివిజన్ పరిధి విద్యుత్ వినియోగదారుల లోకల్‌కోర్ట్‌కు విశేష స్పందన లభించింది. బిల్లులు, మీటర్ల మార్పు, మీటర్లు కాలిపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, సకాలంలో స్పందించని సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై రైతులు 1912 టోల్‌ఫ్రీకి నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్ సాంకేతిక సభ్యుడు సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు లకావత్ కిషన్, మంచిర్యాల డీఈఈ కైసర్, ఏడీఈ మోహన్‌రెడ్డి, ఏఈలు ప్రభాకర్, బి.శ్రీనివాస్, ఏఈ మహేందర్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment