పకడ్బందీగా ధాన్యం సేకరణ
● మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, రైస్‌మిల్లర్లతో ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ దేవేంద్రసింగ్‌చౌహాన్ మాట్లాడుతూ రైస్‌మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం అందిస్తామని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా రైస్‌మిల్లులు పని చేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం వహించిన మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3,550 మెట్రిక్‌టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని, 1,241 మెట్రిక్ టన్నులు ఽకొనుగోలు చేశామని తెలిపారు.
రైతులు మద్దతు ధర పొందాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం హాజీపూర్ మండలం గుడిపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్‌తో కలిసి సందర్శించారు. కమిషనర్ మాట్లాడుతూ 48గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఓ కిషన్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్‌పాండే, ఏఓ కృష్ణ, గిర్దావర్ ప్రభు, ఎస్సై గోపతి సురేశ్, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment