కారుతో ఢీకొట్టి.. తొక్కించి హత్య
● మామాఅల్లుళ్ల అరెస్టు ● వివాహేతర సంబంధమే కారణం..! ● వివరాలు వెల్లడించిన జైపూర్ ఏసీపీ
భీమారం: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. ఎగిరిపడ్డ అతడిని కారుతో తొక్కించా రు. ప్రాణాలు పోయాయని భావించి అక్కడి నుంచి పారిపోయారు. పథకం ప్రకారం ఓ వ్యక్తిని హ త్య చేసిన మామాఅల్లుళ్లను పోలీసులు అరెస్టు చేశా రు. గురువారం సాయంత్రం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్ వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలంలోని రసూల్‌పల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ఆకుదారి మల్లేశ్ తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అదే గ్రామానికి చెందిన తోట సాయికుమార్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో సాయికుమార్ గతంలోనూ అతడిపై దాడికి యత్నించగా.. పోలీసులు కాపాడారు. ఆ తర్వాత ప్రాణభయంతో మల్లేశ్ రసూల్‌పల్లి గ్రామాన్ని వదిలి భీమారం మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ పోలంపల్లిలోని ప్రైవేటు పాఠశాల బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సాయికుమార్ తన మామ గట్టు సదయ్యతో కలిసి మల్లేశ్ హత్యకు పథకం రూపొందించాడు. భీమారంలో ఉంటున్న మల్లేశ్ కదలికలను ఎప్పుటికప్పుడు గమనిస్తున్న నిందితులు సాయికుమార్, సదయ్యలు అతడిని హత్య చేసేందుకు కారు కొనుగోలు చేశారు. బుధవారం కారులో భీమారం వెళ్లారు. మల్లేశ్ కోసం కాపు కాసి ఉండి మంచిర్యాల వైపు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా కారులో వెంబడించారు. భీమారం మండల కేంద్రంలోని ఇప్పలబొగుడ వద్ద మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న మల్లేశ్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారని, ఎగిరి కింద పడ్డ అతడిపై కారు ఎక్కించి తొక్కించారని ఏసీపీ తెలిపారు. ప్రాణాలు పోయాయని భావించిన నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. నిందితులను గురువారం రసూల్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. మల్లేశ్‌ను హత్య చేసిన సాయికుమార్, అతడి మామ సదయ్యపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ సీఐ డి.వేణుచందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment