మంచం పట్టిన మామిడిగూడెం
కాసిపేట: మండలంలోని మామిడిగూడెం గ్రామం జ్వరాలతో మంచంపట్టింది. గ్రామంలో 115 కు టుంబాలు ఉండగా 10కుటుంబాలకు పైగా జ్వరా లతో బాధపడుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధి కారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నామని, కుటుంబంలో ఒక్కరికి జ్వరం వస్తే అందరికీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రులు, మందమర్రి ఆర్‌ఎంపీల వద్ద చికిత్స పొందుతున్నారు. కాగా, గ్రామంలో 15రోజులకు పైగా చెత్త తొలగించడం లేదు. మురికి కాలువలు నిండి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. అధికారులు స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారి శుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
జ్వరాలతో ఇబ్బందులు
కానరాని పారిశుద్ధ్య చర్యలు
Comments
Please login to add a commentAdd a comment